డ్రాగా ముగిసిన కోల్ కతా టెస్ట్

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన తొలి టెస్ట్ లో టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ 172 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత లంక 294 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. ఎనిమిది వికెట్లకు 352 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక వరుస వికెట్లు కోల్పోయింది. 26.3 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి  75 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో, తొలి టెస్ట్ డ్రాగా ముగించారు.