డీజీపీ అనురాగ్ శర్మకు ఘనంగా వీడ్కోలు

కొత్త రాష్ట్రంలో అన్ని ఇబ్బందులు అధిగమించి.. దేశంలో తెలంగాణ పోలీస్ ను నెంబర్ వన్ గా నిలబెట్టిన ఘనత డీజీపీ అనురాగ్ శర్మకు దక్కుతుందన్నారు నూతన డీజీపీ మహేందర్ రెడ్డి. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీలేదని తెలంగాణ పోలీసులు నిరూపించారన్నారు. అటు తెలంగాణ తొలి డీజీపీ పనిచేయడం గర్వంగా ఉందన్నారు అనురాగ్ శర్మ. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ప్రజలు భాగస్వాములయ్యారని చెప్పారు.శాంతి భద్రతల పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ పోలీసులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. తనతో కలిసి పనిచేసిన వారందరికి అనురాగ్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ చేస్తున్న డీజీపీ అనురాగ్ శర్మకు తెలంగాణ పోలీస్ అకాడమీలో కవాతు, పరేడ్ లతో  ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.