డబ్బింగ్ చెప్పుకుంటున్న తెలుగు అమ్మాయి

విశాఖపట్నానికి చెందిన అవీషా ఆంబ్రోస్ ఆర‌ణాల తెలుగ‌మ్మాయి. అయితే ఆమె పేరును చూసి అంద‌రూ నార్త్ ఇండియ‌న్ అనుకుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె న‌టించిన అలియాస్ జానకి, గోపాల గోపాల, రన్, ఒక్కడు మిగిలాడు త‌దిత‌ర మూవీల్లో ఆమె పాత్ర‌ల‌కు డ‌బ్బింగ్ చెప్పించారు. అయితే ఇక‌పై తాను న‌టించే చిత్రాల‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌నే నిర్ణ‌యిం తీసుకుంది. తాజాగా పెళ్లిచూపులు ఫేమ్ త‌రుణ్ భాస్క‌ర్ తీస్తున్న రెండో చిత్రంలో ఆమె హీరోయిన్. ఈ మూవీకి తానే వాయిస్ ఇచ్చుకుంటాన‌ని ముందే ద‌ర్శ‌కుడుకి చెప్పింది. అందుకు ద‌ర్శ‌కుడు కూడా ఓకే చెప్పాడ‌ట‌.