టెక్నాలజీ వల్ల సుపరిపాలన సాధ్యం

ప్రజలకు సులువుగా  సేవలు అందించేందుకు డిజిటల్ టెక్నాలజీ కీలకంగా మారిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. టెక్నాలజీ వల్ల సుపరిపాలన సాధ్యమైందన్నారు. వసుదైక కుటుంబం అన్న భారతీయ సనాతన ధర్మాన్ని డిజిటల్ టెక్నాలజీ నిరూపిస్తుందన్నారు.  సైబర్ స్పేస్ పై 5వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. రెండు రోజుల పాటు సైబర్ స్పేస్ సదస్సులో పలు దేశాలకు చెందిన సైబర్ నిపుణులు పాల్గొననున్నారు. సైబర్‌  స్పేస్‌లో పెట్టుబడులు పెట్టి ప్రగతిలో భాగస్వామ్యం కావాలని ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.