టీహబ్-2 ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ కాబోతుంది

టీహబ్ సత్ఫలితాలనిస్తోందన్నారు మంత్రి కేటీఆర్. టీహబ్-2 ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ కాబోతుందన్నారు. వచ్చే ఏడాది టీహబ్-2 ను ప్రారంభిస్తామన్నారు. మహబూబ్ నగర్ లో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. లక్షా 20 వేల ఐటీ ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారాయన. టీ-ఫండ్ తో ఔత్సాహిక యువకులకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. అసాం, గోవా, త్రిపుర రాష్ట్రాలకు ఐటీ సాయాన్ని అందజేస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్.