టీనేజ్ కుమార్తెకు తల్లీగా ఇషా తల్వార్

వ‌య‌స్సు ఎంత పెరిగినా హీరోయిన్‌గా చేయాల‌ని చాలా మంది ఆరాట‌ప‌డుతుంటారు. కాని ఓ 29 ఏళ్ల హీరోయిన్ అమ్మ పాత్రలను యాక్సెప్ట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. గుండె జారి గల్లంతయిందే చిత్రంలో నటించిన ఇషా తల్వార్.. ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తూనే ఉంది. గతేడాది రాజా చెయ్యి వేస్తే చిత్రంలో కనిపించిన ఈ భామ.. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో యాక్ట్ చేస్తోంది. ఇప్పుడీ భామ ఓ మలయాళ మూవీకి కూడా సైన్ చేసింది. డెట్రాయిడ్ క్రాసింగ్ అనే పేరుపై ఈ చిత్రం రూపొందుతున్న‌ది. ఈ మూవీలో త‌న పాత్ర గురించి మాట్లాడుతూ,రెబెల్ గా ప్ర‌వ‌ర్తించే  టీనేజ్ కుమార్తెకు త‌ల్లిగా న‌టిస్తున్నాన‌ని తెలిపింది.. త‌న‌కు  వైవిధ్య పాత్ర‌లంటే  ఇష్టమ‌ని తెలిపింది.  ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ యూఎస్ లో జరుగుతున్నద‌ని,  షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాన‌ని ఇషా తల్వార్ తెలిపింది.