టీఆర్టీపై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలి

కాంగ్రెస్, బీజేపీలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. గతంలో ఇబ్బడిముబ్బడిగా యూనివర్సిటీలను మంజూరు చేసి… ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. టీఆర్టీపై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారాయన.

అటు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగంపై ఎలాంటి హామీ ఇవ్వలేదని కుండబద్దలు కొట్టారు మంత్రి హరీశ్ రావు. ఉద్యోగాల విషయంలో అవాస్తవాలను ప్రచారం చేయొద్దని హితవు పలికారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్ష సభ్యులు చేసిన ఆరోపణలపై వారు స్పందించారు.