టిఆర్ఎస్ లో చేరిన మహబూబ్ నగర్ టీడీపీ ఫ్లోర్ లీడర్

మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో టీడీపీ పక్ష నాయకుడు కృష్ణమోహన్ తన 500 మంది అనుచరులతో కలిసి టిఆర్ఎస్ లో చేరారు. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కృష్ణమోహన్ తో పాటు టిఆర్ఎస్ లో చేరిన వారిలో తెలంగాణ న్యాయవాదుల క్యారం ఛాంపియన్ నరేందర్ గౌడ్, టీడీపీ యువజన నాయకుడు సుభాన్ జీ, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి లతీఫ్, రైతు సంఘం సభ్యుడు హనుమంతు రెడ్డి, టీడీపీ సీనియర్ నేతలు ఆది కృష్ణమోహన్,
శివరాములు, వెంకట్ స్వామి, పాండురంగం, సత్యనారాయణ, ముజఫర్ అలీ, ఆనంద్ రావు, భాస్కర్ తో పాటు 500 మంది కార్యకర్తలు ఉన్నారు.

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు బాదిమి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.