టిఆర్ఎస్ లో చేరిన టీడీపీ జిల్లాల అధ్యక్షులు

జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు పెద్దసంఖ్యలో తమ అనుచరులతో ఇవాళ టిఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

టీఆర్ఎస్‌లో చేరినవారిలో భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ రావు, మంథని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నర్సింగరావు, జనగామ టీడీపీ జిల్లా అధ్యక్షుడు, హుస్నాబాద్ టీడీపీ ఇన్ చార్జ్ రవీందర్ రావు ఉన్నారు. వారితో పాటు పలువురు మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వేల మంది టీడీపీ కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎంపీ వినోద్ కుమార్, తెలంగాణ మహిళా కో ఆపరేటివ్ సొసైటీ చైర్ పర్సన్ గుండు సుధారాణి, వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఎమ్మెల్యేలు పుట్ట మధు, యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.