టిఆర్ఎస్ లో చేరిన కొడంగల్ కాంగ్రెస్, టీడీపీ నేతలు

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ, కాంగ్రెస్ నేతలు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. మంత్రులు హరీశ్ రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మాజీ జడ్పీటీసీ, డీసీసీ అధికార ప్రతినిధి ఎండీ సలీం, దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి, కోసిగి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సలీం, ముద్దూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు హనిమిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి నసీర్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ-టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ ముజీబ్, గోకుల్ నగర్ సర్పంచ్ మీరాన్, దూద్యల్ ఎంపీటీసీ బికినీ భాయ్, మద్దూర్ మాజీ ఉప సర్పంచ్ చాంద్ పాషా ఆధ్వర్యంలో వందల మంది కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు.

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, జిల్లా టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.