ఆర్థిక మంత్రి పదవి నుంచి జైట్లీని తప్పించాలి

మోడీ సర్కార్ చేపట్టిన నోట్ల రద్దు, జి.ఎస్.టి పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా   మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని వెంటనే తొలగించి మరొకరిని ఆర్థిక మంత్రిగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. జి.ఎస్‌.టి విషయంలో జైట్లీ…మెదడు వాడలేదన్నారు. అవసరమైనప్పుడల్లా జి.ఎస్‌.టి లోమార్పులు చేస్తున్నారని…ఇలా చేస్తే జి.ఎస్‌.టి ప్రయోజనం ఏముంటుందన్నారు. నోట్లరద్దు, జి.ఎస్‌.టి విషయంలో ప్రభుత్వం అబద్దాలు చెబుతుందన్నారు. అటు తన కుమారుడు జయంత్‌ సిన్హా    పేరు ప్యారడైజ్‌ పేపర్స్‌ లో ఉన్నందున ఆయనపై దర్యాప్తు జరపాలని సైతం యశ్వంత్ సిన్హా   డిమాండ్‌ చేశారు.