జేపీ దర్గా అభివృద్ధికి రూ.50 కోట్లు

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ప్రసిద్ధ జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి సీఎం కేసీఆర్ భారీగా నిధులు ప్రకటించారు. దర్గా అభివృద్ధి, చుట్టుపక్కల రోడ్లు, విశ్రాంతి గదులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.50 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ నిధులు వెంటనే మంజూరు చేస్తానని, ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఇవాళ జేపీ దర్గాను సందర్శించిన ముఖ్యమంత్రి, మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. దర్గాకు ఇప్పటికే 20 ఎకరాల భూమి ఉందని, దానిని ఆనుకొని ఉన్న మరో 80 ఎకరాల ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం వంద ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపడతామని సీఎం కేసీఆర్ చెప్పారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ఎమ్మెల్సీ సలీం, మాజీ డీజీపీ ఏకే ఖాన్ ఆధ్వర్యంలో దర్గాను అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.