జేపీ దర్గాలో మొక్కులు చెల్లించిన సీఎం కేసీఆర్

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్‌ పీర్ దర్గాను ముఖ్యమంత్రి కేసీఆర్  సందర్శించారు. దర్గాలోని బాబాల సమాధులపై పూల ఛాదర్లు ఉంచి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత దర్గా అభివృద్ధిపై నిర్వాహకులు, మతపెద్దలు, ముస్లిం ప్రజా ప్రతినిధులతో అక్కడే మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జితేందర్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, వినోద్, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.