జీఈఎస్ లో ప్రత్యేక ఆకర్షణగా ‘మిత్ర’

హైదరాబాద్ హెచ్ఐసిసిలో ప్రారంభమైన గ్లోబల్ ఆంట్రప్రేన్యూర్ షిప్ సమ్మిట్ లో మిత్ర రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమ్మిట్ ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఇవాంక కు మిత్ర రోబో స్వాగతం పలికింది. జీఈఎస్‌ లోగోను ఆవిష్కరించాలని ఆహ్వానించింది. రోబో మీద ఉన్న ఇండియా లోగోను మోడీ నొక్కగా, అమెరికా లోగోను ఇవాంకా నొక్కారు. దీంతో అధికారికంగా సదస్సు ఆరంభమైంది. మిత్ర రోబోను బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ డెవలప్‌ చేసింది.