జీఈఎస్ భారత్ కు గర్వకారణం

దక్షిణాసియాలో తొలిసారి జరుగుతున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సదస్సుకు ఆతిధ్యమివ్వడం భారత్‌కు గర్వకారణమన్నారు నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌. మహిళలు ఆర్థిక సాధికారత సాధించడమే సదస్సు ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. అమెరికా, భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జీఈ సమ్మిట్ లో ఆవిష్కరణలతో పాటు ఉపాధి కల్పనపై చర్చ జరుగుతుందని వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో మహిళలు దూసుకుపోయేందుకు కృషి చేస్తున్నట్లు అమితాబ్ కాంత్ తెలిపారు. జీఈ సమ్మిట్ తో దేశాల మధ్య బంధాలు మరింత బలోపేతమవుతాయని భారత్ లో అమెరికా రాయబారి కెన్నిత్‌ ఐ జెస్టర్‌ అభిప్రాయపడ్డారు. సదస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కూడా పాల్గొన్నారు.