జర్నలిస్టులకు అరుణ్ సాగర్ అవార్డ్స్

దివంగత సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ సాగర్ పేరిట ఈ ఏడాది కూడా అవార్డ్స్ ఇస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. తెలుగు పాత్రికేయులు తమ ఎంట్రీలు డిసెంబర్ 8 లోపు అందజేయాలని చెప్పారు. ముగ్గురు ఉత్తమ జర్నలిస్టులకు అవార్డ్స్ ఇస్తామన్నారు. మొదటి బహుమతి 75 వేలు, రెండవ బహుమతి 50 వేలు, మూడో బహుమతి 25 వేలు ఇవ్వనున్నట్టు అల్లం నారాయణ తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే వారు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మానవీయ కోణంలో, సామాజిక అంశాలకు సంబంధించిన ప్రత్యేక కథనాలకు అవార్డులు ఇస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ కథనం చేసింది తానేనని సదరు ఎడిటర్ ధృవీకరించిన లెటర్ పంపించాలని తెలిప్పారు. జనవరి 2, 2018 న హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీలో ఈ పురస్కారాలు అందజేస్తామని అల్లం నారాయణ వెల్లడించారు.