జనవరి 7న గిన్నిస్ రికార్డ్ సైక్లింగ్ ఫీట్

వచ్చే జనవరి 7వ తేదీన హైదరాబాద్ లో గిన్నీస్ రికార్డ్ సైక్లింగ్ ఫీట్ చేయబోతున్నారు. 29 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా జరిగే ఈ కార్యక్రమం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సంబంధించిన యాప్ ని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టీఏ అధికారులు, తెలంగాణ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం 9.5 కిలోమీటర్లు సైకిల్ వెనుక సైకిల్ తో కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషకరమని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్, తాను లిలాండ్ సంస్థతో ఒప్పందం చేసుకొని సిరిసిల్లలో డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం సహాయంతో డ్రైవర్స్ కి అనేక శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నామని మంత్రి వివరించారు.