‘చేనేత మిత్ర’ పథకం ప్రారంభం

చేనేత కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరేలా రూపొందించిన చేనేత మిత్ర పథకాన్ని మంత్రి కేటీఆర్ వరంగల్ లో ప్రారంభించారు. ఈ పథకం కింద 40 శాతం సబ్సిడీతో చేనేత కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలు, ఇతర సంబంధిత పదార్థాలు సరఫరా చేస్తారు. గతంలో 20 శాతం ఉన్న సబ్సిడీని సీఎం కేసీఆర్ ఆదేశంతో 40 శాతానికి పెంచారు. మరోవైపు, వీటికి కేంద్రం నుంచి ఇచ్చే 10 శాతం సబ్సిడీ కూడా కొనసాగుతుంది. దీంతో, ముడి సరుకుల కొనుగోలుపై మొత్తం 50 శాతం సబ్సిడీ నేత కార్మికులకు అందుతుంది.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, కొండా సురేఖ, ఆరూరి రమేశ్, మేయర్ నరేందర్, తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్దసంఖ్యలో నేత కార్మికులు పాల్గొన్నారు.