ఘనంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవం

మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మైనార్టీల కోసం పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సీఎం కేసీఆర్.. దేశంలోనే నంబర్‌ వన్‌ ముఖ్యమంత్రిగా నిలిచారని కొనియాడారు.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి రోజున నిర్వహించిన ఈ వేడుకలకు మహమూద్ అలీ, నాయిని, ఎంపీ బండారు దత్తాత్రేయ, మైనారిటీ సంక్షేమ సలహాదారు ఏకే ఖాన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సలీం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేల మంది మైనారిటీ గురుకులాల విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది.