ఘనంగా చైతు, సమంతల రిసెప్షన్

నాగ చైతన్య, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగ జరిగింది.. కొత్త జంటకు తో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వేడుకకు తరలి వచ్చి ఆశీర్వదించారు. సూపర్ స్టార్ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, రాఘవేంద్రరావు, నందమూరి హరికృష్ణ, రాజమౌళి, కీరవాణి, హీరో కార్తీ, జయసుధ, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, శివాజీ రాజా, ఉత్తేజ్, ఆర్ నారాయణమూర్తి తదితరులు వధూవరులను ఆశీర్వదించారు.