గ‌్లామ‌ర్‌ తో అలరిస్తున్న దిశా

లోఫర్ సినిమాతో టాలీవుడ్ ని అలరించిన అందాల తార దిశా  పటాని .. స్టార్ హీరోల సరసన మినహాయిస్తే.. తను హీరోయిన్ గా నటించబోనని తెగేసి చెప్తోంది.. అలాగని ఈమె ఖాతాలో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయా అంటే అదేమీ లేదు. పోనీ ఏ స్టార్ కి వారసురాలు కూడా కాకపోవడంతో.. ఆ స్థాయి ఆఫర్స్ రావడం కష్టంగానే ఉంది. తన టార్గెట్ తగినట్లుగా ప్రయత్నాలు చేయడంలో మాత్రం దిశా ఎక్కడా తగ్గడం లేదు. తను ఏ స్థాయిలో గ్లామర్ పండిచగలదో ఇండస్ట్రీ జనాలకి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. తాజాగా మాగ్జిమ్ ఇండియా కోసం ఓ ఫోటో షూట్ చేసింది ఈ భామ. తన సోషల్ మీడియా పేజ్ లో ఇందుకు సంబంధించిన ఓ పిక్ ను షేర్ చేసింది. డిజైనర్ డెనిమ్ షార్ట్.. బ్లాక్ టాప్ లో ఓ పక్కకు తిరిగి కూర్చున్న దిశా.. ఈ ఫోటోలో మనకు దర్శనం ఇస్తుంది. నడుము ఒంపుల నుంచి ప్రతీ పాయింట్ లోనూ తన గ్లామర్ ను ఎంతవరకూ పంచగలదో అంతవరకూ ఎగ్జిబిట్ చేసింది దిశా