గ్లోబల్ సమ్మిట్ కు భారీ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్ HICC లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌ కు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి  చెప్పారు. 28 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సమ్మిట్ లో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, అమెరికా ప్రెసిడెంట్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్, తదితర దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు. దీంతో వారి భద్రత కోసం 10, 400 పోలీసులతో బందోబస్తు.. అలాగే 21 హోటళ్లు, ఎయిర్ పోర్టు, హెచ్‌ఐసీసీకి వెళ్లే  మార్గాల్లో పటిష్ఠంగా భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. అటు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని సీసీ కెమెరాలను ఆపరేట్ చేస్తామని తెలిపారు.