గౌహతిలో జీఎస్టీ కౌన్సిల్ భేటి

కీలకమైన జీఎస్టీ కౌన్సిల్ 23వ సమావేశం ప్రారంభమైంది. గౌహతిలో జరుగుతున్న ఈ సమావేశంలో వినియోగదారులకు ఊరట కలిగించే పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చేతితో రూపొందించిన ఫర్నీచర్‌, షాంపు, శానిటరీ వేర్‌, ప్లై వుడ్‌ వంటి 200లకు పైగా వస్తువులపై పన్ను రేటును తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 28 శాతం శ్లాబులో ఉన్న సేవలు, వస్తువుల్లో 80 శాతం ఇకపై 18 శాతం పన్ను పరిధిలోకి రాబోతున్నట్లు సమాచారం. రెస్టారెంట్లపై విధిస్తున్న పన్ను రేట్లను కూడా తగ్గించబోతున్నట్టు తెలుస్తోంది. పన్ను రేట్లను తగ్గించాలని రెస్టారెంట్ల యజమానులు జీఎస్టీ కౌన్సిల్‌ ను కోరారు. దీంతో వారి అభ్యర్ధనను పరిశీలించిన కౌన్సిల్… ఇవాళ్టి సమావేశంలో చర్చిస్తున్నారు. అంతేకాదు జీఎస్‌టీ 28 శాతం శ్లాబు పరిధిలో ఉన్న 227 ఐటమ్స్‌ లో దాదాపు 80 శాతం ఐటమ్స్‌ ను 18 శాతం శ్లాబులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.