గద్వాలలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో త్వరలో 100 పడకల మాతా శిశు వైద్యశాల ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ ను జిల్లా వైద్యశాలగా అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. గద్వాల హాస్పిటల్ లో ఐదు పడకల డయాలసిస్ సెంటర్ ను ఆయన ఇవాళ ప్రారంభించారు.

ప్రభుత్వ ద‌వాఖానల‌లో ప్రైవేట్ హాస్పిట‌ల్స్‌ కి ఏ మాత్రం తీసిపోని విధంగా వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. నాణ్యమైన‌, మెరుగైన సేవ‌లు అందించాల‌న్నదే సీఎం కేసీఆర్ సంక‌ల్పమ‌న్నారు. అందుకు త‌గ్గట్లుగా త‌మ వైద్య సిబ్బంది ప‌ని చేస్తున్నార‌ని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ, జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్‌,  మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవ‌మ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజ‌లు  పాల్గొన్నారు.