కోటీ 69 లక్షలకు పైగా ఈత మొక్కలు నాటినం

రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటీ 69 లక్షలకు పైగా ఈత మొక్కలను నాటామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. ఈత చెట్లను సంరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. 2014 నుంచి ఎన్ని ఈత, తాటి మొక్కలు నాటారు, ఆ చెట్ల నుంచి తీసిన నీరా పానీయం క్రయవిక్రయాలకు తీసుకుంటున్న చర్యల గురించి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి పద్మారావు సమాధానమిచ్చారు. గీత కార్మికులు వృత్తిలో ఉండగా ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబానికి ఇచ్చే నష్టపరిహారం సీఎం కేసీఆర్ రూ. 6 లక్షలకు పెంచిన విషయం మంత్రి గుర్తు చేశారు. కేరళ తరహాలో గీత కార్మికులకు తాటిచెట్లు ఎక్కేందుకు మిషన్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు.