కొలువుల కొట్లాట సభను వాయిదా వేసుకోండి

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నేపథ్యంలో కొలువుల కొట్లాటను వాయిదా వేసుకోవాలన్నారు మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇదే విషయాన్ని కోర్టుకు.. జేఏసీకి తెలిపామన్నారు. మరోవైపు సన్ బర్న్ షో కు సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవన్నారు పల్లా. అనవసరపు విమర్శలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రేవంత్ కు దమ్ముంటే చేసిన ఆరోపణలపై చర్చకు రావాలన్నారు.