కేంద్ర హోంమంత్రితో ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ భేటి

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను టిఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్ కలిశారు. పునర్విభజన చట్టంలోని హామీలను త్వరగా నెరవేర్చాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపు అంశాలను కేబినెట్ ముందుకు తీసుకెళ్తామని రాజ్‌నాథ్‌సింగ్ హామీనిచ్చినట్లు వారు వెల్లడించారు.

మరోవైపు, అక్షరాస్యతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ వినోద్ వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో 66 శాతం అక్షరాస్యత ఉందన్నారు. ఇవాళ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ఎంపీ వినోద్ కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.  2009లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన సాక్షర భారతి పథకాన్ని తెలంగాణలో కొనసాగించాలని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను కోరినట్లు చెప్పారు. గ్రామీణ స్థాయిలో సాక్షర భారతి ఉద్యోగుల జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేసినమన్నారు.