కుల్గాం ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కుల్గాం ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న బలగాల పైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో జవాన్లు…ఉగ్రవాదులకు ధీటుగా సమాధానమిస్తున్నారు. ముగ్గురి నుంచి నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నట్లు గుర్తించారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అటు ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను వీర మరణం పొందారు. మరో పోలీస్ గాయపడ్డాడు. తెల్లవారుజామున ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో కుల్గాం, అవంతీపుర ప్రాంతంలోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కాల్పులు జరుగుతున్న ప్రాంతంలోని గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.