కుప్వారా ఎన్ కౌంటర్ లో జవాను మృతి

జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లా గుజ్జర్ పటి అడవుల్లో జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ఒక ఆర్మీ జవాను చనిపోయాడు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టిన భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటలుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.