కిరాణా సరుకుల లోడ్ తో ఉన్న లారీ చోరీ

కిరాణా సరుకుల లోడ్‌ తో ఉన్న లారీని ఎత్తుకెళ్లిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన పిడుగుల శ్రీను యాదవ్ తన సొంత లారీలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి లోడ్ తీసుకెళ్తున్నాడు. నిన్న ఆదివారం కావడంతో అన్ లోడ్ చేయరని… లారీని తన ఇంటి వద్దే పార్కు చేశాడు. ఆదివారం రాత్రి కూడా ఉన్న లారీ… ఈ రోజు ఉదయం కనిపించలేదు. బాధితుడి సమాచారం మేరకు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు… కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.