కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు అనుమతులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు అనుమతులు లభించాయి. కేంద్ర భూగర్భ జల శాఖ, కన్ స్ట్రక్షన్ మిషనరీ కన్సల్టెన్సీ డైరెక్టరేట్ అనుమతులు ఇచ్చింది.

ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అనుమతి, స్టేజ్-1 అటవీ అనుమతి, పర్యావరణ టీఓఆర్ లభించాయి. గత వారం రోజులుగా ప్రాజెక్టు సీఈ హరి రాం ఢిల్లీలో మకాం వేసి ప్రాజెక్టుల క్లియరెన్స్ లపై సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రెండు రోజులుగా సాగునీటి శాఖ మంత్రి హరీశ్ రావు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ కే జోషి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు క్లియరెన్స్ లపై  కేంద్ర మంత్రులను కలిసి త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.