కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న విభేదాలు

ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో అవి మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్ సీనియర్‌ నేత హనుమంత రావు సమక్షంలో.. మాజీ మంత్రి రాంచంద్రయ్య, పీసీసీ కార్యదర్శి గండ్రోత్‌ సుజాత వర్గీయులు బాహాబాహీకి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కార్యక్రమం రసాభాసగా మారింది.