కాంగ్రెస్ కు మంత్రి కేటీఆర్ సవాల్

రాష్ట్ర శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏడేండ్లలో మైనింగ్ ఆదాయం 39 కోట్లు అయితే… తెలంగాణ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో 11 వందల కోట్ల ఆదాయం వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియాను పూర్తిగా రూపుమాపామని చెప్పారు. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వ తీరుపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.