కర్నాటకలో కొనసాగుతున్న డాక్టర్ల సమ్మె

కర్నాటకలో ప్రైవేట్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న కర్నాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్‌ మెంట్ బిల్లును వ్యతిరేకిస్తూ దాదాపు 22 వేల మంది డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. 660కి పైగా క్లినిక్ లలో ఔట్ పేషెంట్ విభాగాలు పని చేయడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే చూస్తున్నారు. దాంతో గవర్నమెంట్ ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు చనిపోతే… దానికి ఆస్పత్రి యాజమాన్యాలే బాధ్యత వహించాలని చట్టంలో చేర్చనున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. అయితే, సమ్మెపై డాక్టర్లతో చర్చిస్తామని చెప్పారు సీఎం సిద్ధరామయ్య.