ఐసిస్ కథ ముగిసింది!

మూడేళ్లుగా ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్‌ కథ ముగిసింది. ఇరాక్‌, సిరియాలను కేంద్రంగా చేసుకొని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న కాలిఫేట్‌ నామరూపాల్లేకుండా పోయిందని అమెరికా ప్రకటించింది. ఐసిస్ ఉగ్రవాదులపై పోరాడుతున్న అమెరికా సంకీర్ణ సేనలు ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాయి. ఐసిస్ చెరనుంచి 75 లక్షల మందికి పైగా ప్రజలకు విముక్తి కల్పించినట్టు చెప్పాయి. ఉగ్రవాదుల అర్థిక మూలాలను పూర్తిగా దెబ్బతీయడంతో ఐసిస్‌ 95 శాతం తుడిచిపెట్టుకుపోయిందని వెల్లడించింది.