ఐఫోన్ కు ధీటుగా షియోమీ 7

చైనాకి చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ ఐఫోన్ టెన్‌కు గట్టి పోటీ ఇచ్చే ఫోన్‌తో రాబోతుంది. షియోమీ ఎంఐ7 పేరుతో సరికొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఎడ్జ్ టు ఎడ్జ్ ఓలెడ్ డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరాతో వస్తున్న ఇది ఐఫోన్ టెన్, వన్‌ప్లస్ 5టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. జనవరిలో ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.