ఐదోసారి మేరీ గోల్డ్

భారత స్టార్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్‌ ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో మరోసారి తన పంచ్ పవర్ చూపెట్టింది. ఐదోసారి ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నది. ఇవాళ జరిగిన ఫైనల్లో ప్రత్యర్థిని మట్టి కరిపించింది. 48 కేజీల విభాగంలో నార్త్‌ కొరియాకు చెందిన యాంగ్‌ మీ కిమ్‌ను ఈజీగా ఓడించింది. 5-0 తేడాతో మేరీ విజయం సాధించింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆరుసార్లు తలపడిన మేరీ ఐదుసార్లు స్వర్ణంతో మెరిసింది. ఈ విక్టరీతో 48 కేజీల బౌట్‌లో పసిడి నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా కూడా మేరీ రికార్డుకెక్కింది.