ఎస్సారెస్పీ ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని

ఎస్సారెస్పీ ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అన్నారు మంత్రి హరీశ్ రావు. ఎస్సారెస్పీ పునర్జీవన ప్రాజెక్ట్ ను అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశామన్నారు. కేవలం మూడు లిఫ్టులు నిర్మిస్తే రెండింటి ద్వారానే నీరు పంపింగ్ జరుగుతుందన్నారు.   12 లక్షల 45 వేల ఎకరాలకు  ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. వచ్చే ఎడాది కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఎస్సారెస్పీకి కనెక్ట్ చేసి  రైతాంగానికి రెండు పంటలకు సరిపడా సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ  ద్వందవైఖరీ సరికాదని హరీశ్ రావు మండిపడ్డారు