ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాని మోడీ

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మొన్న కచ్ లో సుడిగాలి పర్యటన నిర్వహించిన మోడీ…ఇవాళ సౌరాష్ట్రలో పర్యటిస్తున్నారు. అభివృద్ధి అంటే కాంగ్రెస్ దృష్టిలో చేతి పంపులు ఇవ్వడం మాత్రమేనని, అయితే బీజేపీ మాత్రం పైప్ లైన్ల ద్వారా నర్మదా నది నీటిని ప్రతి ఎకరాకు చేరేలా చేసిందని గుర్తు చేశారు. జీఎస్టీ విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని, బెంజ్ కారును, సామాన్యుడు తినే ఆహార పదార్ధాలపై ఒకే రకమైన పన్ను వేయాలని కోరడం సరైంది కాదన్నారు. అందుకే లగ్జరీ వస్తువులు, ఆరోగ్యానికి హానీ చేసే పొగాకు ఉత్పత్తులపై ట్యాక్స్ ఎక్కువగా వసూలు చేస్తున్నామన్నారు.