ఎంపీ కవిత కృషికి రామ్ దేవ్ బాబా మద్దతు

పసుపు బోర్డు ఏర్పాటుకు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత చేస్తున్న ప్రయత్నంలో ముందడుగు పడింది. పసుపు పండించే రైతులను ఆదుకునేందుకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపుకు మద్దతు ధర నిర్ణయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యోగా గురువు, పతంజలి గ్రూప్ ప్రమోటర్ బాబా రామ్ దేవ్ లేఖ రాశారు.

పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని పసుపు పండించే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీల ద్వారా ఎంపీ కవిత కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల హరిద్వార్ వెళ్లిన ఎంపీ కవిత, పసుపు బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను రామ్ దేవ్ కు వివరించారు. పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే  అసోం, కేరళ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానికి లేఖలు రాశారు.