ఉగ్రవాదుల్ని ఏరివేస్తాం

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కృషి చేస్తున్నారన్నారు జీవోసీ జనరల్ జేఎస్ సంధూ. 2017 వ సంవత్సరంలో నిన్నటి వరకు మొత్తం 190 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు చెప్పారు. అందులో 80 మంది జమ్మూకాశ్మీర్ కు చెందిన వారు కాగా, 110 మంది విదేశీ ఉగ్రవాదులుగా గుర్తించారు. నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లకు ప్రయత్నించిన 66 మంది ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టినట్లు చెప్పారు. అటు హజిన్ ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా కీలక నేత లఖ్వీ మేనల్లుడు హతమయ్యాడని చెప్పారు. ఈ ఏడాది వ్యాలీలో చెలరేగిన అల్లర్లను సమర్ధవంతంగా అణచివేశామన్నారు.