ఈడెన్ లో అదరగొట్టిన విరాట్

ఈడెన్ టెస్ట్ లో కెప్టెన్ విరాట్ అదరగొట్టాడు. అద్భుత సెంచరీతో టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. వన్డే తరహాలో రెచ్చిపోయిన కోహ్లీ. లంక బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. కెరీర్ లో 50వ  సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 8వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. లంక ముందు 231 పరుగుల లక్ష్యాన్నుంచింది.