ఈజిప్టులో ఐసిస్ నరమేథం

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఈజిప్టులో నరమేధం సృష్టించారు. సినాయ్ లోని అల్ అరిష్ మసీదులో ప్రార్థనలకు వచ్చిన ముస్లింలను లక్ష్యంగా చేసుకొని పేలుళ్లు జరిపారు. మసీదు నుంచి బయటికి పరుగులు పెడుతున్న ప్రజలపై నాలుగు వాహనాల్లో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 200 మంది చనిపోయారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఉగ్రవాదుల దాడితో మసీదు లోపల, బయట ఎక్కడ చూసినా మాంసపు ముద్దలు, శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా సిబ్బంది.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్హా  కైరోలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. సినాయ్‌లో జరిగిన ఉగ్రదాడిపై సమీక్షించారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఈజిప్ట్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.