ఇవాంకతో ప్రధాని మోడి భేటి

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కూతురు ఇవాంక ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడి సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో కాసేపట్లో ప్రారంభం కానున్న గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ సైడ్ లైన్స్ లో ఈ సమావేశం జరిగింది. భారత్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇవాంక కు ప్రధాని మోడీ వివరిస్తున్నారు.

ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, భారత్, అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.