ఇది ఊహించని విజయం

న‌టి ప‌రిణితీ చోప్రా  నటించిన ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’ చిత్రం ఇప్పటి వరకు 203 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేసింది. ఇది ఊహించని విజయం అని ఆమె తెలిపింది. సక్సెస్‌ ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని చిత్రాల్లో నటిస్తాన‌ని తెలిపింది. అజయ్‌ దేవగన్‌, పరిణీతి చోప్రా, టబు, ఆర్షద్‌ వార్సీ ప్రధాన పాత్రల్లో రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో హర్రర్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను సాధిస్తోంది. ఇప్పటి వరకు ఏకంగా రూ.203 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ ద్వారా తెలిపారు. సైలెంట్‌గా వచ్చిన ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్ళను రాబట్టడం బాలీవుడ్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో ఖుషి పాత్రలో నటించిన పరిణీతి పాత్రకు మంచి స్పందన రావడం పట్ల ఆమె ఆనందానికి అవధుల్లేవు.