ఆర్కే నగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

తమిళనాడులోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు రెండోసారి షెడ్యుల్‌ విడుదల చేసింది ఎన్నికల సంఘం. డిసెంబర్‌ 21న పోలింగ్‌, 24న కౌంటింగ్‌  నిర్వహించనున్నట్లు తెల్పింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆర్కేనగర్‌ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలనే నిబంధన ఉన్నప్పటికీ.. అది సాధ్యం కాలేదు. గత ఏప్రిల్‌ 12 న ఉప ఎన్నిక నిర్వహించించేందుకు  ఈసీ  షెడ్యుల్ కూడా విడుదల చేసింది. దీంతో శశికళ మేనల్లుడు దినకరన్‌, ఓపిఎస్  వర్గం పోటాపోటీగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలు రావడంతో..ఉప ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది.