ఆర్కే నగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తా

తమిళనాడులోని ఆర్కేనగర్‌ ఉపఎన్నిక తేదీ ఖరారు కావటంతో…ఆ స్థానం నుంచి పోటీ చేస్తానని టీటీవీ దినకరన్‌ చెప్పారు. ఈ స్థానం నుంచి గెలిచి జయలలిత వారసులం తామేనని నిరూపిస్తామన్నారు. రెండాకుల గుర్తు కోసం పోరాటం కొనసాగుతుందని సైతం దినకరన్‌ చెప్పారు. అటు పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గం నుంచి సీనియర్‌ నేత ఆర్కేనగర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దివంగత జయలలిత మరణంతో ఆర్కేనగర్‌లో ఉపఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. జయ మరణం తర్వాత ఆరు నెలలకే ఎన్నికలు నిర్వహించాల్సినప్పటికీ…శశికళ వర్గం భారీ ఎత్తున ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేసినట్లు ఆరోపణలు రావటంతో ఈ ఎన్నికను వాయిదా వేశారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో వచ్చే నెల 21 న ఆర్కే నగర్‌ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది.