ఆరు గంటల్లోనే దొంగల్ని పట్టుకున్నారు!

బషీర్ బాగ్ దొంగతనం కేసుని హైదరాబాద్ పోలీసులు వేగంగా ఛేదించారు. ఫిర్యాదు అందిన ఆరు గంటల్లోనే ఐదుగురు దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 1.26 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. బషీర్ బాగ్ లోని సీపీ కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు చెప్పారు. ఈ కేసు విచారణలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి సీపీ రివార్డులు అందజేశారు.