అసెంబ్లీ రేపటికి వాయిదా

తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత మైనారిటీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చ కొనసాగింది. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి నిబద్ధతతో తీసుకుంటున్న చర్యలను సీఎం కేసీఆర్ సుధీర్ఘంగా వివరించారు. అనంతరం మూడు బిల్లులను సభ ఆమోదించింది. తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రకటించారు.