ఇండియన్ ఆర్మీ బైక్ వింగ్ అరుదైన ఫీట్

ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు బెంగళూరులో అరుదైన ఫీట్ చేసి వరల్డ్ రికార్డు సాధించారు. ఒకే బైక్ పై ఇద్దరు కాదు, ముగ్గురు కాదు ఏకంగా 58 మంది ప్రయాణించారు. బెంగళూరులోని ఎలహంక ఎయిర్ బేస్‌ లో ఇండియన్ ఆర్మీకి చెందిన మోటార్ సైకిల్ విభాగం టోర్నడోస్ ఈ ఫీట్ చేశారు.  500 సీసీ రాయల్ ఎన్‌ ఫీల్డ్  బైక్ పై ఒకేసారి 58 మంది ఎక్కి 12 వందల మీటర్లు ప్రయాణించారు. ఈ ఫీట్ ను చేసేందుకు టోర్నడోస్ చాలా రోజుల పాటు రిహార్సల్స్ చేశారు. ఆర్మీ చేసిన ఈ అరుదైన ఫీట్ ను చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారు.